
రవి ప్రకాష్, శివ కుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'విద్రోహి'. విఎస్‌వి దర్శకుడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా ఇప్పుడు తొలి సాంగ్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దీన్ని లాంచ్ చేశారు. ఈ మధ్యే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.
సాంగ్ విడుదల అనంతరం వినాయక్ మాట్లాడుతూ.. 'విద్రోహి ఫస్ట్ లుక్ చూశాను. అలాగే ఈ కథ గురించి కూడా విన్నాను. చాలా మంచి కథ. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నా. నేను విడుదల చేసిన సాంగ్ కూడా చాలా బాగుంది. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా చేసిన రవి ప్రకాష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. మంచి ఆర్టిస్ట్. ఈ సినిమా, టీమ్ అందరికీ మంచి సక్సెస్‌ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు.