టాలీవుడ్ హీరోగా.. హీరోయిన్ నివేదా థామస్ తమ్ముడు | Nivetha Thomas Brother Telugu Movie Updates | Sakshi
Sakshi News home page

Nivetha Thomas: 'బెంగళూరు మహానగరంలో బాలక'తో టాలీవుడ్ ఎంట్రీ

May 26 2026 12:26 PM | Updated on May 26 2026 12:30 PM

Nivetha Thomas Brother Telugu Movie Updates

తెలుగులో నిన్నుకోరి, జెంటిల్‌మేన్, 35 ఇది చిన్న కథ కాదు, జై లవకుశ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసి గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్ తమ్ముడు ప్రస్తుతం తెలుగులో హీరోగా చేస్తున్నాడు. 'బెంగుళూరు మహానగరం లో బాలక'తో టాలీవుడ్‌లోకి వస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తయింది.

(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)

మంత్ర మూవీ మేకర్స్ , ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మహి-రాజ్ ద్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఫస్ట్ లుక్‌ని ప్రియదర్శి చేతుల మీదుగా విడుదల చేశారు. తెలుగు కుర్రాడు.. బెంగళూరులో ఎదుర్కొనే కష్టాల నేపథ్యంతో వినోదభరితమైన కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లోనూ షూటింగ్ చేశారు. 

(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)

Advertisement
 
Advertisement
Advertisement