
శుక్ర, మాటరాని మౌనమిది తదితర సినిమాలు తీసిన దర్శకుడు పూర్వాజ్ లేటెస్ట్ మూవీ 'ఏ మాస్టర్ పీస్'. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ తీస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ సినిమాని మన పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశా. దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది. ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో క్యారెక్టర్‌ని, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఓ అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశాం. శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా స్క్రిప్ట్‌ని ఈ చిత్రంలో చూస్తారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని డైరెక్టర్ పూర్వాజ్ చెప్పుకొచ్చారు.