టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకుడిగా మారారు. ఇప్పటివరకు పాటల రచయిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన టాక్సిక్ రిలేషన్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో వస్తున్నారు. ఆ మూవీ పేరే 'లలిత'. కాస్మిక్ పవర్ క్రియేట్స్ LLP బ్యానర్‌పై పి. సుధీర్ రాజు, డి.వైష్ణవి నేహా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో నందిని హీరోయిన్‌గా, అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలుగా పరిచయమవుతున్నారు.
మణి, నాగరాజు సంయుక్తంగా సంగీతమందిస్తుండగా.. ఇందులో రఘుబాబు, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. తన వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'గర్ల్‌ఫ్రెండ్ అంటే బానిస కాదు' అనే క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.


