తెలుగులో చాన్నాళ్ల తర్వాత పిల్లల సినిమా.. టీజర్ రిలీజ్ | Summer Holidays Movie Teaser | Sakshi
Sakshi News home page

Summer Holidays: ఆకట్టుకునేలా 'సమ్మర్ హాలీడేస్' టీజర్

May 27 2026 4:30 PM | Updated on May 27 2026 4:32 PM

Summer Holidays Movie Teaser

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల మూవీస్ దగ్గర నుంచి పిల్లల చిత్రాల వరకు అన్ని రకాలవి వచ్చేవి. ప్రస్తుతం మాత్రం కమర్షియల్, రెగ్యులర్ సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. వీటికి మొహం మొత్తేసిన ప్రేక్షకులు కూడా థియేటర్‌కి వచ్చే ఆసక్తి చూపించట్లేదు. అయితే చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్‌లో ఓ పిల్లల మూవీ వచ్చేస్తోంది. దాని పేరు 'సమ్మర్ హాలీడేస్'. తాజాగా దీని టీజర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్)

ఇప్పుడంటే వేసవి వస్తే పిల్లలందరూ సమ్మర్ క్యాంపుల పేరిట బిజీ అయిపోతున్నారు గానీ ఒకప్పుడు అమ్మమ్మ ఊరికి వెళ్లేవాళ్లు. ఆ జ్ఞాపకాలని గుర్తుచేసేలా ఈ సినిమాని తీసినట్లు తెలుస్తోంది. పట్నంలో ఉండే ఓ పిల్లాడు.. వేసవిలో అమ్మమ్మ ఉండే పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ ఈ పిల్లాడికి మరో అల్లరి పిల్లాడు పరిచయమవుతాడు. తర్వాత వీళ్లిద్దరూ ఎలాంటి సందడి చేశారనేదే స్టోరీ అనిపిస్తుంది. రోహన్, అరుణ్ లీడ్ రోల్స్ చేశారు. త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement