రెండు నెలల క్రితం 'ఫంకీ'తో వచ్చిన హీరో విశ్వక్ సేన్ ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాలు సెట్స్‌పై ఉండగా తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఎన్టీఆర్‌తో 'దేవర' తీసిన నిర్మాణ సంస్థలో నటించేందుకు సిద్ధమైపోయాడు. ఈ మూవీ అధికారికంగా సోమవారం లాంచ్ అయింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
ఐదేళ్ల క్రితం అల్లు అర్జున్-కొరటాల శివ కాంబోలో సినిమాని ప్రకటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యువసుధ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ.. దాన్ని అలా పక్కనబెట్టేసి ఎన్టీఆర్-కొరటాల శివతో 'దేవర'ని అనౌన్స్ చేసింది. 2024 సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. దీని సీక్వెల్ అప్పుడు ఇప్పుడు అంటున్నారు గానీ అసలు వస్తుందా రాదా అనేది తెలియట్లేదు. అదలా ఉండగానే విశ్వక్ సేన్‌తో ఈ సంస్థ, కొత్త మూవీ ప్రకటించింది.
రొమాంటిక్ కామెడీ స్టోరీతో తీసే ఈ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకుడు. కొరటాల శివనే ఈ మూవీకి క్లాప్ కొట్టారు. ఇకపోతే 'దేవర' రిలీజైన దగ్గర నుంచి కొరటాల ఖాళీగానే ఉన్నారు. దేవర సీక్వెల్ చేస్తారా వేరే హీరోతో మూవీస్ ఏమైనా చేస్తారా అనేది ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు.
(ఇదీ చదవండి: హీరో రామ్‌కి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా?)
The journey begins with divine blessings ✨
Production No.3 of @YuvasudhaArts starring ‘Mass Ka Das’ @VishwakSenActor, a new-age rom-com, is officially launched ❤🔥
▶️ https://t.co/K7l4o1nisT
Director – @RajathDir
Producer – #SudhakarMikkilineni
An auspicious pooja ceremony… pic.twitter.com/AjVTprZ4Ep— Yuvasudha Arts (@YuvasudhaArts) April 13, 2026


