హీరో రామ్‌కి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? | Actor Ram Pothineni About Single Status And Marriage Plans | Sakshi
Sakshi News home page

Ram Pothineni: ఎన్నాళ్లీ సింగిల్ బతుకు? క్లారిటీ ఇచ్చిన రామ్

Apr 13 2026 3:37 PM | Updated on Apr 13 2026 3:45 PM

Actor Ram Pothineni About Single Status And Marriage Plans

తెలుగు హీరోల్లో బ్యాచిలర్స్ అనుకున్న వాళ్లకు కూడా ఒక్కొక్కళ్లకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ప్రభాస్, రామ్, సాయిధరమ్ తేజ్ లాంటి కొందరు మాత్రమే ఇంకా సింగిల్‌గా ఉన్నారు. వీళ్లలో ప్రభాస్ చేసుకుంటాడా అంటే సందేహమే. సాయిధరమ్ తేజ్ మాత్రం ఈ ఏడాదో వచ్చే ఏడాదో శుభవార్త చెప్పేలా ఉన్నాడు. రామ్ మాత్రం ఇప్పుడు తన సింగిల్ స్టేటస్, పెళ్లి వాటిపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై స్పందించాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

'చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగా ఉండటం అలవాటుపడ్డా. ఖాళీ టైంని ఒక్కడినే ఆస్వాదిస్తుంటా. స్నేహితులు, మిగతా వాళ్లతో గడపటం ఇష్టమే ‍కానీ నాకోసం నేను టైమ్ కేటాయించుకోవడంలో ఆనందముంది. ఆ ఏకాంతం నాకు ఎంతో రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఎవరైనా నా జీవితంలోకి వస్తే వాళ్లతో సమయం గడిపేందుకు సిద్ధమే. రాకపోయినా ఒంటరిగా సంతోషంగా ఉంటాను. ఇదేదో కావాలని తీసుకున్న నిర్ణయమైతే కాదు' అని రామ్ చెప్పుకొచ్చాడు.

రామ్ మాటల బట్టి చూస్తుంటే జీవితాంతం సింగిల్‌గానే ఉండిపోతాడేమో అనిపిస్తుంది. ఇతడి గత సినిమా 'ఆంధ్ర కింగ్ తాలుకా' టైంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు రామ్ మాటల బట్టి చూస్తుంటే అవన్నీ ప్రమోషన్స్ కోసం సృష్టించినట్లే అనిపిస్తున్నాయి.

ఇకపోతే ఇండస్ట్రీలో వందలాది మందితో పనిచేయడం గురించి మాట్లాడుతూ.. అది తప్పదని చెబుతూనే, అందరి మధ్య కూడా తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నానని చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్‌లో ఏడాదిన్నర పాటు ఒంటరిగానే బతికానని గుర్తుచేసుకున్నాడు.  

(ఇదీ చదవండి: రష్మి కాదు మరో యాంకర్‌తో సుడిగాలి సుధీర్ డేటింగ్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement