నాగార్జున కోసం ముగ్గురు హీరోయిన్లు? | Nagarjuna 100th Movie Heroines Details | Sakshi
Sakshi News home page

Nagarjuna: ముగ్గురు బ్యూటీస్ నాగ్ కోసం.. వీళ్లు ఎవరంటే?

Mar 29 2026 9:11 PM | Updated on Mar 30 2026 10:25 AM

Nagarjuna 100th Movie Heroines Details

తెలుగు సీనియర్ హీరోల్లో నాగార్జున సరైన సక్సెస్ చూసి చాలాకాలమైంది. గతేడాది కుబేర్, కూలీ సినిమాల్లో కాస్త డిఫరెంట్ పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హీరోగా 100వ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో తప్పితే అధికారికంగా ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ల గురించి డిస్కషన్ నడుస్తోంది. ఏకంగా ముగ్గురు బ్యూటీస్ నాగ్ సరసన నటించబోతున్నారట.

(ఇదీ చదవండి: వివాదంలో మురుగ..‍ రూ.10 కోట్ల డిమాండ్.. చివరకు ఫ్రీగా)

గతంలో నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాలో కెమిస్ట్రీతో అదరగొట్టిన నాగ్-టబు.. ఈ సినిమా కోసం మళ్లీ కలుస్తున్నారట. చాన్నాళ్ల క్రితమే ఈ రూమర్ బయటకొచ్చింది. కానీ నిజమా కాదా అనేది మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ ఐశ్వర్య రాజేశ్ కూడా మరో కథానాయికగా ఎంపికైందని అంటున్నారు. వీళ్లిద్దరితో పాటు సుస్మితా భట్ అనే తమిళ బ్యూటీ కూడా ఇందులో ఉందని టాక్ వినిపిస్తోంది.

తమిళ దర్శకుడు ఆర్.కార్తిక్ తీస్తున్న ఈ సినిమా లాటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా తీస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఈ ‍స్టోరీని గట్టిగా నమ్మిన నాగ్.. తనే స్వయంగా నిర్మిస్తున్నారు కూడా. ఏదేమైనా నాగ్ సరసన ముగ్గురు హీరోయిన్లు అనే రూమర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?)

Advertisement
 
Advertisement
Advertisement