వివాదంలో మురుగ..‍ రూ.10 కోట్ల డిమాండ్.. చివరకు ఫ్రీగా | Ar Murugadoss Issue With Madarasi Movie Producer | Sakshi
Sakshi News home page

Ar Murugadoss: ‍అసలే ఫ్లాపులు.. ఇప్పుడు వివాదంలో ఇరుక్కుని

Mar 29 2026 8:14 PM | Updated on Mar 30 2026 10:24 AM

Ar Murugadoss Issue With Madarasi Movie Producer

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా వెలుగువెలిగిన ఏఆర్ మురుగదాస్.. ఇప్పుడు కెరీర్ పరంగా పూర్తిగా డౌన్ అయిపోయాడు. చేసిన సినిమాలు చేసినట్లు అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి ఒక్కరూ కూడా ఇతడిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇది చాలదన్నట్లు ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. టాలీవుడ్ నిర్మాత.. తాజాగా ఫిర్యాదు చేయడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏమైంది?

(ఇదీ చదవండి: చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?)

గతేడాది మురుగదాస్ నుంచి రెండు మూవీస్ వచ్చాయి. వాటిలో సల్మాన్ ఖాన్‌తో చేసిన 'సికందర్' ఒకటి కాగా శివకార్తికేయన్‌తో చేసిన 'మదరాశి' ఒకటి. ఇవి రెండు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. 'మదరాశి' చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఇప్పుడు తమిళ దర్శకులు, నిర్మాతల కౌన్సిల్‌లో ఏఆర్ మురుగదాస్‌పై ఫిర్యాదు చేశారు. తొలుత రూ.115 కోట్ల బడ్జెట్ అని చెప్పి షూటింగ్ పూర్తయ్యేసరికి రూ.170 కోట్ల మేర ఖర్చు చేశాడని తన కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

అయితే బడ్జెట్ పెరగడానికి మురుగదాస్‌కి సరైన ప్లానింగ్ లేకపోవడం, దీనితో పాటు 'సికందర్' సమాంతరంగా చేయడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. తమకు జరిగిన నష్టానికిగానూ రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరువర్గాల మధ్య చర్చ జరగ్గా.. అంతిమంగా కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకుంది.

దీని ప్రకారం.. ఏఆర్ మురుగదాస్, తన రమణ 2(ఠాగుర్ సీక్వెల్) స్టోరీని సదరు నిర్మాణ సంస్థకు ఉచితంగా ఇచ్చేందుకు అంగీకారం తెలిపాడట. అలా ఈ వివాదానికి ఓ పరిష్కారం దొరికిందని కోలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మురుగదాస్ చేతిలో కొత్త ప్రాజెక్ట్ ఏం లేదు. ఈ వివాదం జరిగిన తర్వాత వస్తుందా అనే నమ్మకం కూడా కలగట్లేదు!

(ఇదీ చదవండి: అందాల 'చిచ్చుబుడ్డి'.. ఎవరీ జోనితా గాంధీ?

Advertisement
 
Advertisement
Advertisement