రూమర్స్ నిజమయ్యాయి.. తెలుగు దర్శకుడితోనే సల్మాన్ | Salman Khan Next Movie With Vamshi Paidipally Update | Sakshi
Sakshi News home page

Salman Khan: వరస ఫ్లాపులు.. సల్మాన్ ఈసారైనా హిట్ కొడతాడా?

Mar 30 2026 3:10 PM | Updated on Mar 30 2026 3:15 PM

Salman Khan Next Movie With Vamshi Paidipally Update

స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హవా బాలీవుడ్‌లో చాన్నాళ్ల నుంచి తగ్గుతూ వస్తోంది. దాదాపు సరైన హిట్ కొట్టి పదేళ్లవుతోంది. గతేడాది 'సికందర్' అనే మూవీతో వచ్చాడు. ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం 'మాతృభూమి' అనే దేశభక్తి సినిమా చేస్తున్నాడు. దీనిపైనే ఎవరికి పెద్దగా నమ్మకాల్లేవు. అలాంటిది ఇప్పుడు తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో జట్టుకట్టాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

(ఇదీ చదవండి: విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత)

మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి, వారిసు (వారసుడు) సినిమాలతో ఓ మాదిరి హిట్స్ కొట్టిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. మూడేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త సినిమాని ప్రకటించాడు. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఏప్రిల్ రెండో వారం నుంచి షూటింగ్ కూడా మొదలు కానుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులోనే నయనతార హీరోయిన్ అని అంటున్నారు కానీ క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

Advertisement
 
Advertisement
Advertisement