విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత | Bengali Actor Rahul Arunoday Banerjee Passed Away | Sakshi
Sakshi News home page

సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయిన హీరో.. సీఎం సంతాపం

Mar 30 2026 9:14 AM | Updated on Mar 30 2026 9:46 AM

Bengali Actor Rahul Arunoday Banerjee Passed Away

బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హీరో రాహుల్‌ అరుణోదయ్‌ బెనర్జీ (42) ప్రమాదవశాత్తూ మరణించారు. సీరియల్‌ షూటింగ్‌ కోసం ఆదివారం (మార్చి 29) నాడు పశ్చిమ బెంగాల్‌లోని డిఘ ప్రాంతానికి వెళ్లిన ఆయన చిత్రీకరణ ముగిశాక కాలక్షేపం కోసం ఒంటరిగా సముద్రంలో విహారానికి వెళ్లారు. అయితే పడవలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయారు. 

బీచ్‌లో విషాదం
అది గమనించిన రక్షణా సిబ్బంది వెంటనే ఆయన్ను బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒడిశా- పశ్చిమ బెంగాల్‌ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా రాహుల్‌ బెనర్జీకి భార్య ప్రియాంక సర్కార్‌, ఒక కుమారుడు ఉన్నారు.

ఇండస్ట్రీకి తీరని లోటు
హీరో మృతిపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాకు ఇష్టమైన నటుల్లో రాహుల్‌ ఒకరు.. ఆయన ఇక లేరనే వార్త నన్ను షాక్‌కు గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. తన మరణం బెంగాలీ చిత్రపరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.

సినిమా
రాహుల్‌ అరుణోదయ్‌ బెనర్జీ (Rahul Arunoday Banerjee) 1983 అక్టోబర్‌ 16న జన్మించారు. చిరోదిని తుమీ జే అమర్‌ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్‌ సర్కస్‌, షోనో మోన్‌ బోలీ తోమయ్‌, నా హణ్యతే, కగోజెర్‌ బో వంటి పలు సినిమాలు చేశారు. సీరియల్స్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.

చదవండి: ఓపక్క షూటింగ్‌.. మరోపక్క భార్య కోసం ఆరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement