ఓపక్క షూటింగ్స్‌.. మరోపక్క భార్య కోసం హీరో ఆరాటం! | Ranveer took breaks to be with pregnant Deepika: Abhay Arora | Sakshi
Sakshi News home page

బిజీ షెడ్యూల్‌.. గ్యాప్‌ దొరికితే భార్య దగ్గర వాలిపోయిన ధురంధర్‌ హీరో

Mar 30 2026 8:32 AM | Updated on Mar 30 2026 9:12 AM

Ranveer took breaks to be with pregnant Deepika: Abhay Arora

ఒక సినిమా హిట్టయిందంటే.. దానికి సీక్వెల్‌గా వచ్చేదానిపై భారీ అంచనాలుంటాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. అయితే ఈ పరీక్షను ఈజీగా నెగ్గేసింది ధురంధర్‌ టీమ్‌. రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటించిన ధురంధర్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఈ మూవీ వచ్చిన మూడు నెలల్లోపే సీక్వెల్‌ కూడా రెడీ చేసి వదిలాడు దర్శకుడు ఆదిత్య ధర్‌.

గర్భిణి అయిన భార్య కోసం..
రెండో భాగం కూడా ప్రేక్షకుల మనసు గెల్చుకుని బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల రికార్డు తిరగరాస్తోంది. రణ్‌వీర్‌ సింగ్‌ యాక్టింగ్‌, డెడికేషన్‌కు సినీప్రియులు ఫిదా అవుతున్నారు. ధురంధర్‌ మొదటి భాగం చిత్రీకరణ సమయంలో అతడి భార్య, స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె గర్భిణీ అన్న విషయం తెలిసిందే! ఓపక్క బిజీ షెడ్యూల్‌లో పని చేస్తూనే మరోపక్క భార్య కోసం సమయం కేటాయించాడట! ఈ విషయాన్ని ధురంధర్‌ మూవీ నటుడు అభయ్‌ అరోరా వెల్లడించాడు.

నిజంగా అద్భుతం
రణ్‌వీర్‌ షూటింగ్‌ మధ్యలో మూడు, నాలుగు రోజులు గ్యాప్‌ దొరికినా సరే.. వెంటనే విమానం ఎక్కి ఇంట్లో వాలిపోయేవాడు. భార్యను, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. కాస్తంత సమయం దొరికినా కుటుంబం కోసం సమయం కేటాయించేవాడు​. అతడు ఫ్యామిలీని చూసుకునే విధానం నిజంగా అద్భుతం అని పేర్కొన్నాడు. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. రామ్‌లీలా సినిమా (2013) సెట్‌లో ప్రేమలో పడ్డారు. 2015లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోగా 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2024 సెప్టెంబర్‌ 8న కూతురు దువా జన్మించింది.

చదవండి: ఈవారం ఓటీటీల్లో బోలెడన్ని సినిమాలు.. ఏమేం ఉన్నాయంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement