'దేవుడు వరమందిస్తే' సాంగ్.. రీల్స్ చేస్తే ప్రైజ్‌మనీ | Risk Movie Song Devudu Varamandisthe Released, Makers Announce Reel Contest With Cash Prizes | Sakshi
Sakshi News home page

'దేవుడు వరమందిస్తే' సాంగ్.. రీల్స్ చేస్తే ప్రైజ్‌మనీ

Jun 15 2026 9:19 PM | Updated on Jun 16 2026 1:54 PM

Risk Movie Devudu Varamandisthe Song

ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో సందీప్ అశ్వ హీరోగా  తెరకెక్కిన యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'రిస్క్'. జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ఆకట్టుకోగా ఇప్పుడీ చిత్రంలోని 'దేవుడు వరమందిస్తే' అంటూ సాగే మెలోడీ పాటని దర్శకుడు నక్కిన త్రినాథరావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)

ఈ పాటకు సంబంధించి హుక్ స్టెప్‌తో రీల్స్ లేదా డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో #DevuduVaramandisthe #RISKMovie #SandeepAshwa ట్యాగ్ చేస్తే బెస్ట్ వీడియోలకు చిత్ర యూనిట్ ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించింది. ప్రేమ, స్నేహం, యూత్ ఎమోషన్స్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.

(ఇదీ చదవండి: సిమ్రాన్-విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement