ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా | Paisawala Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: రూ.10 నోటు కోసం వేట.. ఓటీటీలో స్ట్రీమింగ్

May 19 2026 6:37 PM | Updated on May 19 2026 6:53 PM

Paisawala Movie OTT Streaming Now

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారమైతే లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి'తో పాటు జ్యోతిక 'సిస్టమ్', మధువిధు, మేం కాప్‌లం లాంటి డబ్బింగ్ మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అలానే డ్రీమ్ క్యాచర్, భీంసేరి లాంటి చోటా చిత్రాలు అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడీ లిస్టులోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేరింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?

(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్‌మెంట్)

అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత తదితరులు ప్రధాన పాత్రలు చేసిన తెలుగు సినిమా 'పైసా వాలా'. కె.నవీన్ తేజస్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. రూ.10 హవాలా నోటు చుట్టూ తిరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. కానీ స్టార్స్ లేకపోవడంతో దీన్ని జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.

'పైసా వాలా' విషయానికొస్తే.. హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్‌ అవుతుంది. తర్వాత అతడి ఫోన్‌, పర్స్ మిస​్‌ అవుతుంది. అందులోనే హవాలా నోటు ఉంటుంది. పసుపు అంటిన సదరు పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరుగుతుంటాయి. ఈ క్రమంలోనే బెరిదింపులు, హత్యలు కూడా జరుగుతాయి. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement