టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. తన భార్య మౌనిక రాజకీయ ఎంట్రీపై స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతి బయటపెట్టారు. తాము నెలకొల్పిన సేవా సంస్థ 'ఐక్య' గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.
(ఇదీ చదవండి: పెద్ది.. జాన్వీకి మైనస్ కానుందా?)
'ఐక్య' స్వచ్ఛంద సంస్థ. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ప్రజల కోసం దీన్ని ప్రారంభించాం. దీని కోసం మేం మా సొంత నిధులే ఖర్చు పెట్టనున్నాం. నా భార్య మౌనిక రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రస్తుతం మేం రాజకీయాల్లో భాగమయ్యాయం అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.
మౌనిక విషయానికొస్తే.. ఉమ్మడి కర్నూలుకి చెందిన భూమా కుటుంబం ఈమెది. ఈమె తండ్రి భూమా నాగిరెడ్డి వైసీపీ, టీడీపీ, ప్రజారాజ్యం తరఫున రెండుసార్లు ఎమ్మెల్మేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి కూడా రెండుసార్లు ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత పెద్ద కుమార్తె అఖిలప్రియ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ నుంచి గెలిచిన ఈమె.. తర్వాత టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయింది. తల్లిదండ్రుల రాజకీయ వారసురాలగా అఖిలప్రియ కొనసాగుతున్నారు. ఇప్పుడు చిన్నకుమార్తె మౌనిక కూడా రాజకీయాల్లోకి వస్తుండటంతో రాయలసీమ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. మరి మౌనిక.. ఏ పార్టీ తరఫున ఎక్కడ పోటీ చేస్తారనేది చూడాలి?
(ఇదీ చదవండి: మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే)


