సుబ్బా మాధవరపు దర్శకత్వంలో చరణ్ పీసర్ల, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సూర్య బీ పాజిటివ్'. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ జరిగింది. 'దండోరా' దర్శకుడు మురళీకాంత్, 'కిష్కింధపురి' దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు.
హీరో చరణ్ మాట్లాడుతూ.. మా దర్శకులు అమెరికాలో ఉంటారు. ఈ సినిమా దర్శకత్వం చేసేటప్పుడు అక్కడ ఉద్యోగాన్ని అలాగే ఇక్కడే సినిమాను పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి చేశారు. నేను ఇప్పటికి మూడు సినిమాలలో చేశా. కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇది నాలుగో మూవీ. ఈ సినిమా ద్వారా నన్ను ప్రేక్షకులు అభినందిస్తారని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.


