'జాతిరత్నాలు' సినిమాలా ఇది గుర్తుండిపోతుంది | Lafoot Gang Movie Launch | Sakshi
Sakshi News home page

లాంఛనంగా మొదలైన కొత్త తెలుగు సినిమా

May 27 2026 6:48 PM | Updated on May 27 2026 6:55 PM

Lafoot Gang Movie Launch

కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో మొదలైన సినిమా 'లఫూట్ గ్యాంగ్'. హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్‌లో బుధవారం ఉదయం పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు పవన్ సాధినేని, నిర్మాత బీవీఎస్ రవి, రాజ్ తరుణ్, ఆకాష్ పూరీ తదితరులు విచ్చేశారు.

(ఇదీ చదవండి: చాలా భయమేస్తోంది.. ఇలానే అయితే ఏం సినిమాలు తీయాలి?)

ఇందులో నటిస్తున్న అంటోనీ కార్తీక్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా 'జాతిరత్నాలు' తరహాలో అందరికీ గుర్తుండిపోతుందని అన్నారు. 1990ల్లో ఓ హాస్టల్‌లో జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అల్లరి చిల్లరిగా ఉండే యువకుల గ్యాంగ్.. హాస్టల్లో ఎలా ఉంటారు? వారి హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే కథనాలతో ఈ సినిమా ఉండబోతుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదం.. చిరు జోక్యంతో సద్దుమణిగింది)

Advertisement
 
Advertisement
Advertisement