చిరు జోక్యంతో సద్దుమణిగిన 'పెద్ది' వివాదం | Peddi Movie Percentage Issue Latest Update | Sakshi
Sakshi News home page

Peddi Percentage Issue: ఎట్టకేలకు పర్సంటేజీ వివాదానికి పరిష్కారం

May 27 2026 6:28 PM | Updated on May 27 2026 6:56 PM

Peddi Movie Percentage Issue Latest Update

'పెద్ది' సినిమాకు పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు.. లేదు ఎప్పటిలానే రెంట్ మాత్రమే ఇస్తామని నిర్మాతలు పట్టుబట్టుకుని ఉన్నారు. గత కొన్ని వారాల నుంచి ఈ వివాదం అలా నడుస్తూనే ఉంది. ఇప్పుడు దీనికి ఎట్టకేలకు ఓ పరిష్కారం దొరికింది. చిరంజీవి మరోసారి కలిసిన తెలంగాణ ఎగ్జిబిటర్లకు ఓ పరిష్కారం దొరికింది.

(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)

చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ  వివాదం సర్దుమణిగింది. 'పెద్ది' చిత్రాన్ని  రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్ల నిర్ణయించుకున్నారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే రెంట్‌తో పాటుగా 7.5 శాతం ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30 తర్వాత విడుదలయ్యే సినిమాలని పర్సంటేజీ విధానంలో ప్రదర్శించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ నిర్ణయాలను చిరంజీవికి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వివరించగా.. ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా నడుచుకోవాలని ఎగ్జిబిటర్లకు చిరంజీవి సూచించారు.

(ఇదీ చదవండి: చాలా భయమేస్తోంది.. ఇలానే అయితే ఏం సినిమాలు తీయాలి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement