అమెరికా నుంచి వచ్చి దర్శకురాలిగా తెలుగు సినిమా | Rayavalasa Movie Hero First Look | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి వచ్చి దర్శకురాలిగా తెలుగు సినిమా

Apr 4 2026 9:21 PM | Updated on Apr 4 2026 9:21 PM

Rayavalasa Movie Hero First Look

రేసన్ ప్రొడక్షన్స్ తమ తొలి సినిమా 'రాయవలస' ఫస్ట్ లుక్‌ విడుదల చేసింది. ఊరి జీవితం, నిజ సంఘటనల ఆధారంగా మనసును తాకే కథతో దీన్ని తీస్తున్నారు.గోపీ కృష్ణ జె నిర్మించగా.. అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళా దర్శకురాలు రాధిక  తెరకెక్కిస్తున్నారు.

ఒకే షెడ్యూల్‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే కార్తిక్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అమెరికాలో పెరిగిన కార్తిక్, సింగర్‌గా ప్రదర్శనలు ఇచ్చాడు. వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ నటించాడు. ఇతడు ఇప్పుడు 'రాయవలస' మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు.

ఓ రైస్ మిల్ యజమాని రాజు జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. కుటుంబం, స్నేహితులు, పిల్లలతో సాగుతున్న అతని జీవితంలో హీరోయిన్ ప్రవేశం అనూహ్య మలుపులు తీసుకువస్తుంది. భావోద్వేగం, యాక్షన్, సంగీతం కలగలిపిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా 'రాయవలస'ని ప్రేక్షకులను అలరించనుంది. హీరోయిన్‌గా శ్రీషా నూలు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement