'విలేజ్ స్టార్స్' సినిమా లాంఛనంగా ప్రారంభం | Village Stars Movie Launch | Sakshi
Sakshi News home page

'విలేజ్ స్టార్స్' సినిమా లాంఛనంగా ప్రారంభం

Aug 20 2026 10:23 PM | Updated on Aug 20 2026 10:23 PM

Village Stars Movie Launch

ఎన్‌ఎస్‌వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న కొత్త సినిమా ‘విలేజ్ స్టార్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని వెంకటగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నటుడు సమీర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు.

నరేంద్ర, లిల్లీ బళ్ళు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్, సయ్యద్ అబ్జాల్, విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ. నరేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నాగూర్ ఎన్‌జీఆర్ కథ అందిస్తున్నారు. నూతన కథాంశంతో రూపొందుతున్న ‘విలేజ్ స్టార్స్’ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement