యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా విజయ్ దేవరకొండ నిలిచారు. ఏఐ సాంకేతికతతో జరుగుతున్న విపరీత సంస్కృతిపై ఆయన మండిపడ్డారు. మనం పూర్తిగా నీచ స్థాయికి దిగజారామని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టకూడదని.. ఇలాంటి అత్యంత కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాలన్నారు. ఇతరులకు ఒక గుణపాఠంగా నిలవాలి.. ఇలాంటి వారిని మనం ఉపేక్షించకూడదని పోస్ట్ చేశారు.
విజయ్ తన ట్వీట్‌లో రాస్తూ..'మనం పూర్తిగా నీచ స్థాయికి దిగజారిపోయా. మనం ఒకరిపట్ల ఒకరం ఎప్పుడు ఇంత సున్నితత్వం లేకుండా తయారయ్యాం? ఇది ఎలాంటి పెంపకం? మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాం? ఒకరినొకరు కించపరచుకోవడంలో ఆనందాన్ని పొందే సమాజంలోనా? ప్రపంచం మొత్తం ఏఐ జీవనోపాధులను ఎలా దెబ్బతీస్తుందో, ఉద్యోగాలను ఎలా లాగేస్తుందో అని చర్చించుకుంటూ భయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఈ మూర్ఖులు అదే టెక్నాలజీని ఉపయోగించి పూర్తిగా అర్థంలేని పనులు చేస్తున్నారు. ఇది డిజిటల్ రూపంలో జరిగిన లైంగిక దాడి. చట్టం ఇటువంటి చర్యలను అత్యంత తీవ్రంగా పరిగణించాలి. దీనికి వ్యతిరేకంగా నిలబడిన బృందానికి నా పూర్తి మద్దతు ఉంది' అంటూ పోస్ట్ చేశారు.
కాగా. ఎన్టీఆర్ మూవీ దేవరలోని చుట్టమల్లే సాంగ్‌ను ఏఐతో చాలా అసభ్యంగా ఎడిట్ చేశారు. ఇది చూసిన హీరో ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏఐ ద్వారా ఎడిట్ చేసిన ఆ వీడియోని షేర్ చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించాడు. ఒక ఆడపిల్లను అత్యంత అవమానకరంగా చూపేందుకు ఏఐని ఉపయోగించడం సిగ్గు చేటు అని.. ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించాడు. ఈ మేరకు ఎక్స్‌లో సుధీర్గమైన పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన విజయ్ దేవరకొండ ఎన్టీఆర్‌కు మద్దతుగా పోస్ట్ పెట్టారు.
We have stooped to the levels of absolute lowlife. Whoever is responsible for this should not be spared. They must face the harshest possible legal consequences and be made an example of. We must not let this go. when did we became so insensitive to each other. What kind of parenting is going on? what kind of society are we living in? Where we find joy in degrading each other? At a time when the world is debating and fearing how AI disrupt livelihoods and take away jobs, these idiots are using that very technology to do utter nonsense. This is the digital equivalent of sexual assault. The law must treat such acts with utmost seriousness. And to the team standing up against this, you have my full support.
— Vijay Deverakonda (@TheDeverakonda) October 3, 2026


