ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా | Dark Night 2026 Telugu Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: నెలలోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చిన మూవీ

Apr 10 2026 3:41 AM | Updated on Apr 10 2026 10:41 AM

Dark Night 2026 Telugu Movie OTT Streaming Now

తెలుగులో హీరోయిన్, సహాయ నటిగా సినిమాలు చేసిన పూర్ణ.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఈమె నటించిన తెలుగు థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా నెలలోనే స్ట్రీమింగ్‌లోకి రావడం విశేషం. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అది డోంట్ మిస్)

పూర్ణ, విదార్థ్, త్రిగుణ్, బిగ్‌బాస్ ఫేమ్ శుభశ్రీ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'డార్క్ నైట్'. గత నెల 13న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సంగతే జనాలకు పెద్దగా తెలియదు. అలాంటిది ఇప్పుడు సైలెంట్‌గా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఎమోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు.

'డార్క్ నైట్' విషయానికొస్తే.. అలెక్స్ (విదార్థ్), హేమ (పూర్ణ) భార్యభర్తలు. పెద్దల నిశ్చయించిన పెళ్లి చేసుకుంటారు. లాయర్ అయిన అలెక్స్.. తన ఆఫీసులోనే పనిచేసే సోఫియా(శుభశ్రీ)తో అక్రమ సంబంధంలో ఉంటాడు. ఇది తెలిసిన హేమ.. అలెక్స్‌ని వదిలేసి వెళ్లిపోతుంది. అలెక్స్‌తో పాటే జిమ్ ట్రైనర్‌తోనూ సంబంధం ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న అలెక్స్.. తిరిగి హేమ దగ్గరకు వస్తాడు. కానీ అప్పటికే రోషన్(త్రిగుణ్)తో హేమకు స్నేహం కుదురుతుంది. అలెక్స్, హేమ కలవడం రోషన్‌కి నచ్చదు. మరి తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'జన నాయగణ్' సినిమా మొత్తం లీక్.. ఇది ఎవరి పని?)

Advertisement
 
Advertisement
Advertisement