dark night movie
-
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
తెలుగులో హీరోయిన్, సహాయ నటిగా సినిమాలు చేసిన పూర్ణ.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఈమె నటించిన తెలుగు థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా నెలలోనే స్ట్రీమింగ్‌లోకి రావడం విశేషం. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అది డోంట్ మిస్)పూర్ణ, విదార్థ్, త్రిగుణ్, బిగ్‌బాస్ ఫేమ్ శుభశ్రీ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'డార్క్ నైట్'. గత నెల 13న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సంగతే జనాలకు పెద్దగా తెలియదు. అలాంటిది ఇప్పుడు సైలెంట్‌గా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఎమోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు.'డార్క్ నైట్' విషయానికొస్తే.. అలెక్స్ (విదార్థ్), హేమ (పూర్ణ) భార్యభర్తలు. పెద్దల నిశ్చయించిన పెళ్లి చేసుకుంటారు. లాయర్ అయిన అలెక్స్.. తన ఆఫీసులోనే పనిచేసే సోఫియా(శుభశ్రీ)తో అక్రమ సంబంధంలో ఉంటాడు. ఇది తెలిసిన హేమ.. అలెక్స్‌ని వదిలేసి వెళ్లిపోతుంది. అలెక్స్‌తో పాటే జిమ్ ట్రైనర్తోనూ సంబంధం ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న అలెక్స్.. తిరిగి హేమ దగ్గరకు వస్తాడు. కానీ అప్పటికే రోషన్(త్రిగుణ్)తో హేమకు స్నేహం కుదురుతుంది. అలెక్స్, హేమ కలవడం రోషన్‌కి నచ్చదు. మరి తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' సినిమా మొత్తం లీక్.. ఇది ఎవరి పని?) -
ఊహించని ఓ మలుపు
పూర్ణ, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) విధార్థ్, సుభాశ్రీ రాయగురు ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా ‘డార్క్ నైట్’. జీఆర్ ఆదిత్య ఈ సినిమాకు కథ రాసి, దర్శకత్వం వహించారు. పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పీ19 స్టూడియోస్ పతాకంపై సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.ఈ సందర్భంగా సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ– ‘‘నాలుగు ప్రధాన పాత్రలు, వారి జీవితాల చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది. వారి పాత్రల మధ్య ఉన్న సంక్లిష్ట భావోద్వేగాలు, రహస్యాలు, సంఘర్షణలు కథను ఉత్కంఠభరితంగా మలుస్తాయి. అతీంద్రియ అంశాలతో కూడిన ఊహించని ఓ ట్విస్ట్ ఈ కథను కొత్త మలుపు తిప్పి, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మిస్కిన్, సహ–నిర్మాతలు: శ్రీనివాస్ మేదరమెట్ల, జె. కొండలరావు. -
ఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘డార్క్ నైట్’
‘‘ప్రస్తుతం థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా యువత బాగా చూస్తున్నారు. ఆ నేపథ్యంలో రూపొందిన ‘డార్క్ నైట్’ చిత్రం టీజర్ బాగుంది’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ పేర్కొన్నారు. హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డార్క్ నైట్’. జీఆర్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో విధార్ధ్, త్రిగుణ్ (అదిత్ అరుణ్), సుభాశ్రీ రాయగురు, రమా ఇతర పాత్రలు పోషించారు. పటోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘మా ప్రాంతం నుంచి వచ్చిన సురేష్ రెడ్డిగారు ‘డార్క్ నైట్’ చిత్రంతో నిర్మాతగా పరిచయమవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయంతో ఆయన మరిన్ని చిత్రాలు తీసి, తెలుగు పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా నిలబడాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘డార్క్ నైట్’. జీఆర్ ఆదిత్య ఆద్యంతం ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఈ సినిమాని మలిచాడు. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు సురేష్ రెడ్డి కొవ్వూరి. ఈ చిత్రానికి సంగీతం: మిస్కిన్, కెమేరా: కార్తీక్ ముత్తుకుమార్.


