5 నిమిషాల క్లిప్‌ కాదు.. మొత్తం సినిమానే లీక్! | Jana Nayagan Full Movie Circulates Social Media | Sakshi
Sakshi News home page

Jana Nayagan Movie: ఎన్నికల ముందు విజయ్‌కి షాక్.. లీకైన చివరి మూవీ

Apr 10 2026 12:39 AM | Updated on Apr 10 2026 9:56 AM

Jana Nayagan Full Movie Circulates Social Media

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న స్టార్ హీరో, దళపతి విజయ్‌కి లీకువీరులు పెద్ద షాకిచ్చారు. రిలీజ్‌కు రెడీగా ఉన్న 'జన నాయగణ్' సినిమా మొత్తాన్ని సోషల్‌ మీడియాలో లీక్ చేశారు. తొలుత 5 నిమిషాల సీన్స్ అని అంతా అనుకున్నారు. అయితే.. 

టోటల్‌గా మూవీ మొత్తం పార్టు పార్టులుగా సోషల్ మీడియాలో కనిపించేసరికి అభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ట్విటర్, ఇన్ స్టా, ఫేస్‌బుక్ ఈ చిత్రం గురించే పెద్ద చర్చ నడుస్తోంది. 

రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విజయ్, 'జన నాయగణ్' తన చివరి సినిమా అని ప్రకటించారు. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సమస్యల కారణంగా, కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఇప్పటికీ అలానే ఉండిపోయింది. ఎట్టకేలకు తమిళనాడు ఎన్నికలు జరిగిన తర్వాత రిలీజ్ చేస్తారని నిర్మాతలు అనుకుంటున్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. ఇంతలోనే నష్టం జరిగిపోయింది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న మూవీ మొత్తం పైరసీకి గురైనట్లు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

'జన నాయగణ్' సినిమా.. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి రీమేక్‌గా తెరకెక్కించారు. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని తమిళంలో మమిత బైజు చేసింది. అయితే సినిమాని లీక్ చేసింది ఎవరా అని ప్రస్తుతం డిస్కషన్ నడుస్తోంది. మూవీ టీమ్ నుంచి ఎవరైనా లీక్ చేశారా? లేదంటే ప్రత్యర్థి పార్టీలు విజయ్‌పై ఇలా కుట్ర చేస్తోందా? అని అనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement