వరలక్ష్మి 'పోలీస్ కంప్లైంట్' రిలీజ్ ఎప్పుడంటే? | Varalaxmi Sarath Kumar Police Complaint Movie Release Date | Sakshi
Sakshi News home page

Police Complaint Movie: వరలక్ష్మి 'పోలీస్ కంప్లైంట్' రిలీజ్ ఫిక్స్

May 2 2026 5:02 PM | Updated on May 2 2026 5:24 PM

Varalaxmi Sarath Kumar Police Complaint Movie Release Date

విలనిజం, క్యారెక్టర్ రోల్.. ఏదైనా సరే తనదైన నటనతో ఆకట్టుకునే వరలక్ష్మి శరత్‌కుమార్ కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. నవీన్ చంద్రతో కలిసి నటించిన 'పోలీస్ కంప్లైంట్'.. మే 22న థియేటర్లలోకి రానుంది. సంజీవ్ మేగోటీ దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర‌లో కృష్ణసాయి నటించారు. ఇతడి బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న అభిమాన న‌టుడు సూప‌ర్‌స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెష‌ల్ సాంగ్‌ని విడుద‌ల చేశారు.

(ఇదీ చదవండి: లేటెస్ట్ తెలుగు సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)

'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' కాన్సెప్ట్ ఆధారంగా సినిమా తీశాం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి  మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. మొత్తం 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించారు.

(ఇదీ చదవండి: ఆ డైరెక్టర్‌ 10 సార్లు లైంగికంగా వేధించాడు: మోనాలిసా)

Advertisement
 
Advertisement
Advertisement