ఆ డైరెక్టర్‌ 10 సార్లు లైంగికంగా వేధించాడు.. మోనాలిసా సంచలన ఆరోపణలు! | Monalisa Filed POCSO Case Against Sanoj Mishra | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ సెట్‌లో అభ్యకరంగా ప్రవర్తించాడు.. దర్శకుడిపై మోనాలిసా ఫిర్యాదు

May 2 2026 2:21 PM | Updated on May 2 2026 2:34 PM

Monalisa Filed POCSO Case Against Sanoj Mishra

కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో స్టార్‌గా మారిన యువతి మోనాలిసా ఇప్పుడు తరచు వార్తల్లో నిలుస్తోంది. సోషల్‌ మీడియా పుణ్యమా అని హీరోయిన్‌గా మారిన మోనాలిసా.. ఒకవైపు సినిమాల్లోనే నటిస్తూనే.. ప్రియుడు ఫర్మాన్‌ ఖాన్‌ని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత జీవితంపై తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం..వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం..విచారణలో ఆమె మైనర్‌ అని తేలడంతో భర్తపై పోక్సో కేసు నమోదు అవ్వడం..అంతలోనే ఆమె ప్రెగ్నెంట్‌ అని ప్రకటించడం..ఇలా గత కొద్ది రోజులుగా మోనాలిసా పర్సనల్‌ లైఫ్‌ నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఈ వివాదం ముగియకముందే మరో ఈ వైరల్‌ భామ మరో బాంబ్‌ పేల్చింది. తనను హీరోయిన్ గా మార్చి, ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన  డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. అతను తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిశ్రాతో పాటు మరో ముగ్గురిపై కూడా ఆమె పోక్సో చట్టం కింద ఎర్నాకులం పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలన సృష్టించింది.

ఫిర్యాదులో ఏముంది?
‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీ షూటింగ్‌ సమయంలో దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని మోనాలిసా ఫిర్యాదు పేర్కొంది.‘షూటింగ్ సమయంలో దర్శకుడు నాతో పదే పదే అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పినా.. పట్టించుకోలేదు. షూటింగ్‌ మొత్తంలో అతను నన్ను దాదాపు 10 సార్లు  లైంగికంగా వేధించాడు. మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానంటూ అనుచితంగా ప్రవర్తించాడు’ అని ఫిర్యాదులో పేర్కొంది.

న్యాయవాదిపై కూడా ఫిర్యాదు
మోనాలిసా దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు, న్యాయవాది అనిల్ విలయిల్ పేరు కూడా ఉంది.అనిల్ సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారని ఆమె పేర్కొన్నారు. గురువారం కోర్టుకు హాజరైన మోనాలిసా, తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అయితే ఈ ఘటనలు మధ్యప్రదేశ్‌లో జరిగినట్లు తెలుస్తుండటంతో, కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement