'చేతబడి'లో జేడీ చక్రవర్తి | JD Chakravarthy Acts In Chetabadi Movie | Sakshi
Sakshi News home page

'చేతబడి'లో జేడీ చక్రవర్తి

Apr 17 2026 3:47 PM | Updated on Apr 17 2026 4:03 PM

JD Chakravarthy Acts In Chetabadi Movie

ప్రముఖ నటుడు  జేడీ చక్రవర్తి  ప్రధాన పాత్రలో , నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీస్తున్న సినిమా 'చేతబడి'. ఎమ్3 మీడియా, మహా మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యాస్ దర్శకుడు కాగా మహేంద్ర నాథ్ కూండ్ల  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతమందిస్తున్నాడు.

(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'వరూధిని పరిణయం' హీరోయిన్)

బాణామతి బ్యాక్‌డ్రాప్‌లో హారర్ మిస్టరీ ఎలిమెంట్స్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. గురువారం వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి ప్రకటించారు. డిఫరెంట్ అవతార్‌‌లో హీరో, విలన్‌గా  జేడీ చక్రవర్తి కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలియజేసింది.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవకముందే ఐదు భాషల ఆడియో రైట్స్‌ని సరిగమ సంస్థ దక్కించుకుంది. ఓ  పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది. కానీ ఇందులో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్‌, సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 

(ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement