
త్రినాధ్ కఠారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తీసిన సినిమా 'ఇట్లు మీ ఎదవ'. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బళ్లారి శంకర్ నిర్మించారు. తెలుగమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ చిత్ర గ్లింప్స్ రిలీజ్ చేశారు. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ఇతర వివరాలు కూడా త్వరలో వెల్లడించనున్నారు.
