'కృష్ణావతారంపార్ట్ 1' సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ గురువారం(మే 07) థియేటర్లలోకి రానుంది. అత్యంత మహత్తరమైన దివ్యగాథతో తీసిన ఈ చిత్రంలో కృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా సత్యభామగా సంస్కృతి జయన నటించారు. రాధగా సుస్మితా భట్, రుక్మిణిగా నివాసి కృష్ణన్ కనిపించబోతున్నారు.
హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సజన్ రాజ్ కురుప్, శోభాసాంత్, పూనం ష్రాఫ్, పార్థ్ గజ్జర్ నిర్మాతలుగా వ్యవహరించారు. నిర్మాతరాజ్ కురుప్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఆశయంతో పాటు బాధ్యతని మోసుకుని వస్తోంది. మనం లోతైన సాంస్కృతిక జ్ఞాపకాలలో ఉన్న కథని చెబుతున్నప్పటికీ, దాన్ని ఎంతో ఆత్మీయమైన మానవీయకోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం. కృష్ణుడి ప్రయాణాన్ని సత్యభామ కళ్ల ద్వారా అనుభవించి ప్రేక్షకులు బయటకు వస్తే ఈ మూవీకి మేము న్యాయం చేసినట్టే' అని చెప్పుకొచ్చారు. ఈ కథ సత్యభామ కళ్ల ద్వారా ఆవిష్కృతమవుతూ కృష్ణుడి ప్రయాణం, అతని సంబంధాలు, భావోద్వేగ ప్రపంచాన్ని ప్రేక్షకులకు కొత్తగా, ఆత్మీయంగా చూపిస్తుంది.


