
యువ హీరో కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'విలయ తాండవం'. జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద మందల ధర్మారావు, గుంపు భాస్కరరావు నిర్మిస్తున్నారు. వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్ బుధవారం (అక్టోబర్ 1) రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆకాశ్ పూరీ, దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు అతిథులుగా హాజరయ్యారు.
ఆకాష్ పూరి మాట్లాడుతూ.. 'విలయ తాండవం' టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. కార్తీక్ రాజుకి మరోసారి ఈ చిత్రంతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'కార్తీక్ రాజు నేను తీసిన 'కౌసల్యా కృష్ణమూర్తి' చిత్రంలో నటించారు. కార్తీక్ ఎప్పుడూ డిఫరెంట్ కథల్నే ఎంచుకుంటారు. ఈ 'విలయ తాండవం'తో మరోసారి కార్తీక్ రాజుకి హిట్ రావాలి అని అన్నారు.
