రూ. 300 కోట్ల కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఉద్యోగానికి రిజైన్‌..! ఆ క్షణమే అమ్మ, బార్య.. | Man Quit A ₹300 Crore Company Job At 40, What Happened Next Shocked His Family And Inspired Millions | Sakshi
Sakshi News home page

రూ. 300 కోట్ల కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఉద్యోగానికి రిజైన్‌..! ఆ క్షణమే అమ్మ, బార్య..

May 26 2026 3:52 PM | Updated on May 26 2026 5:28 PM

Man leaves high-profile job at Rs 300 crore company

కొన్ని కథలు డేరింగ్‌ నిర్ణయాలు ఎలా తెసుకోవాలో తెలియజేస్తాయి. ఎందుకంటే ఒక్కోసారి రిస్క్ తీసుకోవడానికి చాలా కంగారుపడిపోతాం. కానీ మనలాంటి వారెందరో అదే బాటలో పయనించి సక్సెస్‌ అయిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్ల కథలు వింటే ధైర్యంగా అడుగు వేసే ప్రయత్నం చేయడమే కాదు..ఏనాటికైనా సక్సెస్‌ అందుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ వ్యక్తి కూడా అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబంతో తనతో ఎలా ప్రవర్తించిందో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నారు. 

అశ్వనీ కుమార్‌ అనే పారిశ్రామిక వేత్త 40 ఏళ్ల వయసులో ఏకంగా రూ. 300 కోట్ల కంపెనీలో వైస్‌ ప్రెసిడెంట్‌ లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేసున్నాడు. అధికజీతం, విదేశీ పర్యటను, ఏసీ క్యాబిన్‌లతో బిందాస్‌గా సాగిపోతోంది లైఫ్‌. ఏ చీకు చింత లేదు అయినా సరే మనోడు మానసిక ప్రశాంతతే ప్రధానం అంటూ ఉద్యోగానికి రిజైన్‌ చేసేశాడు. ఆ తత్‌ క్షణమే తన తల్లి తనతో మాట్లాడటే మానేసిందని, భార్య తనకు పిచ్చి పట్టిందేమో అన్నట్లుగా చూసిన చూపుని ఇప్పటికీ మర్చిపోలేనంటున్నాడు. 

ఆయన సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో కార్పొరేట్‌ జీవితానికి స్వస్తి పలికాడు. అనుకున్నట్లు స్టార్టప్‌ వ్యవస్థాపకుడిగా మారి విజయవంతంగా సొంతంగా బ్రాండ్‌ని నిర్మించే రేంజ్‌కు చేరుకున్నాడు. సొంతంగా వ్యాపారం లేదా ఇంకేదైనా ప్రారంభించాలనుకునేవారికి తన కథ స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ వీడియోని షేర్‌ చేస్తున్నా అంటూ తన వ్యక్తిగత సాహసోపేతమైన జర్నీ గురించి వివరించాడు. నెటిజన్లు ఇది నిజంగా ప్రేరణకు పరాకాష్ట అని కొందరు,  మరికొంతమంది మీ కథ అసలైన స్ఫూర్తి అంటూ అశ్విని కుమార్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: వంట చేయడం రాకపోతే విడాకులు ఇవ్వొచ్చా? ధర్మాసనం ఏం చెప్పిందంటే..)
 

Advertisement
 
Advertisement
Advertisement