వరుణుడు కరుణించాలని కృష్ణానది తీరంలో యాగం | - | Sakshi
Sakshi News home page

వరుణుడు కరుణించాలని కృష్ణానది తీరంలో యాగం

Aug 11 2026 2:12 AM | Updated on Aug 11 2026 2:12 AM

న్యూస్‌రీల్‌

కలశ ఇష్టికి ప్రత్యేక ప్రాధాన్యం

అక్రమ కలప సీజ్‌
జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 20 టన్నుల సండ్ర కలపను సీజ్‌ చేశారు.

మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026

- 8లో

నాగార్జునసాగర్‌ : వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు మురవాలని ప్రభుత్వం సోమవారం నాగార్జునసాగర్‌ కృష్ణాతీరంలో మహావరుణ యాగం చేపట్టింది. కృష్ణమ్మ ఒడ్డున విజయవిహార్‌ ప్రాంగణం ఉదయం నాలుగు గంటల నుంచే వేద పండితుల మంత్రోచ్ఛరణలతో మార్మోగింది. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన వరుణయాగం తెల్లవారు జామున 4.05 గంటలకు భారీనీటి పారుదల శాఖామంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు గోవుపూజ, యాగశాల ప్రదక్షిణతో మొదలైంది. 108 మంది రుత్విక్కు లు 11 హోమగుండాల్లో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. యాగంలో ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వరుణుడిని ప్రసన్నం చేసుకునే సంకల్పంతో..

సనాతన హిందూ సంప్రదాయంలో యజ్ఞయాగాలకు విశిష్ట స్థానం ఉంది. వేదకాలం నుంచే వర్షాలకు అధిపతిగా భావించే వరుణ దేవుడిని ఆరాధి స్తూ ప్రత్యేక క్రతువులు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇదే సంప్రదాయంలో భాగంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రభుత్వం ఈ మహావరుణ యాగాన్ని చేపట్టింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనకుండా, రైతులకు సాగునీరు అందుబాటులో ఉండేలా వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పెరగాలని, యాగం సందర్భంగా సంకల్పించారు.

11 హోమ గుండాల్లో వైదిక క్రతువులు

విజయవిహార్‌ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 11 హోమగుండాలు యాగానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.108 మంది రుత్విక్కులు వైదిక విధానాలను అనుసరిస్తూ మత్రోచ్ఛరణలతో హోమ క్రతువు నిర్వహించారు. హోమగుండాల్లో పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ వరుణ దేవుడిని ఆరాధించారు. యాగశాల చుట్టూ దేవతా విగ్రహాలు, కలశాలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయడంతో వాతావరణం మరింత శోభాయమానంగా కనిపించింది.

పూర్ణాహుతి ఘట్టం..

యాగంలో చివరి ఘట్టమైన మహాపూర్ణాహుతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రుత్విక్కులు వేద మంత్రాలను పఠిస్తూ పూర్ణాహుతి ద్రవ్యాలను హోమాగ్నికి సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు యాగశాలలో పాల్గొని రుత్విక్కుల సూచనల మేరకు పూర్ణాహుతి నిర్వహించారు. యాగం విజయవంతంగా పూర్తయి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని ప్రార్థనలు చేశారు.

ప్రజలు వీక్షించేలా ఎల్‌ఈడీ తెరలు

యాగశాలలో జరుగుతున్న వైదిక కార్యక్రమాలను ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేలా విజయవిహార్‌ ప్రాంగణంలో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. యాగశాలలోకి ప్రవేశించలేని భక్తులు, ప్రజలు కూడా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. యాగం సందర్భంగా భద్రత, పార్కింగ్‌, తాగునీరు తదితర సౌకర్యాలను అధికారులు సమకూర్చారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తాం

ఫ ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు

ఫ 108 మంది రుత్విక్కులతో 11 హోమగుండాల్లో వైదిక క్రతువులు

ఫ వేద మంత్రోచ్ఛరణలతో మార్మోగిన ప్రాంగణం

వరుణ యాగంలో కలశ ఇష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వేద పండితులు తెలిపారు. వరుణ దేవుడిని ఆహ్వానిస్తూ నిర్ధిష్ట మంత్రోచ్ఛారణలతో ఆహుతులు సమర్పించడం, కలశాలను పవిత్ర జలంతో సిద్ధం చేసి పూజించడం వంటి కార్యక్రమాలను శాష్త్రోక్తంగా నిర్వహించారు. పూజాసామగ్రి, పండ్లు, పుష్పాలు, ధాన్యాలు తదితరాలతో హోమగుండాల చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement