మహిళా రిజర్వేషన్‌ సాధనకు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌ సాధనకు ఉద్యమం

Aug 11 2026 2:12 AM | Updated on Aug 11 2026 2:12 AM

హుజూర్‌నగర్‌ : కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ను తక్షణం అమలు చేయాలని జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లీశ్వరి డిమాండ్‌ చేశారు. సోమవారం హుజూర్‌నగర్‌ బైపాస్‌ రోడ్డులో నిర్వహించిన సమావేశంలో సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 1న తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ వాల్‌పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 14 వరకు పాదయాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు. నిత్యావసరాల ధరల పెరుగుదలను అరికట్టాలని, విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు మునగ సామ్రాజ్యం, శ్రీలత, మంగమ్మ, నరసమ్మ, వీరమ్మ, జ్యోతి, కుమారి, వెంకటమ్మ, సూరమ్మ, పద్మ, రాణి, నాగమణి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement