మూసీకి 2,183 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

మూసీకి 2,183 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Aug 7 2026 3:59 AM | Updated on Aug 7 2026 3:59 AM

మూసీ రిజర్వాయర్‌

కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం ఎగువ నుంచి మూసీకి 2,183 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. ఈ సీజన్‌లో మూసీ ప్రాజెక్టుకు రెండువేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో రావటం ఇదే మొదటి సారి. ప్రాజెక్టులో గరిష్ట స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 638.90 అడుగులకు చేరుకుంది. మూసీ ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం కుడి కాల్వకు 328, ఎడమ కాల్వకు 306 క్యూసెక్కుల చొప్పున మొత్తం 634 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లీకేజీ, సీపేజీ, ఆవిరి రూపంలో 40 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.92 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement