మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం

Aug 7 2026 3:59 AM | Updated on Aug 7 2026 3:59 AM

పెన్‌పహాడ్‌ : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌ రోల్‌ కాల్‌కు హాజరై పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిబ్బంది క్రమశిక్షణ, బాధ్యతతో ఉండి నేరాలను అరికడుతూ ప్రజలకు, బాధితులకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. గ్రామ పోలీసు అధికారులు బాధ్యతగా పనిచేస్తూ, గ్రామాలను సందర్శిస్తూ ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచాలని అన్నారు. స్టేషన్‌లోని రిసెప్షన్‌ సెంటర్‌, ఫిర్యాదుల నిర్వహణ రికార్డులను తనిఖీ చేసి, స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. గంజాయి సరఫరా, వినియోగం అరికట్టేందుకు, పాత నేరస్తులపై నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు. సామాజిక అంశాలు, సైబర్‌ నేరాలు, ఇతర చట్టాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ బాలునాయక్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఫ ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement