సూర్యాపేటటౌన్ : శాంతిభద్రతల పరిరక్షణే పోలీసు శాఖ లక్ష్యమని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్‌ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువైన 102 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ వస్తువులు, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుందని, నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్‌లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఐటీ కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ సైబర్ వారియర్స్, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు పాల్గొన్నారు.
బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం
పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తోందని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. ప్రతి ఒక్క బాధితుడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు.
ఎస్పీ నరసింహ


