భానుపురి (సూర్యాపేట) : మహిళలు, యువతలో దాగిన ఉన్న వ్యాపార ఆలోచనలకు గ్లోబల్ వేదికను కల్పించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సరికొత్త జాతీయ స్థాయి ప్రోగ్రామ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రాస్‌రూట్స్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్, సోషల్ ఇంపాక్ట్ –ఆంత్రప్రెన్యూర్షిప్ పేర్లతో ఈ శిక్షణ కార్యక్రమాలను అందించనున్నట్లు వెల్లడించారు. యువతను కేవలం ఉద్యోగార్థులుగానే కాకుండా, ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశమన్నారు. 17 నుంచి 23 ఏళ్ల వయస్సు ఉన్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీఈఓ అశోక్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, డీడబ్ల్యూఓ నరసింహారావు, సీతా పళ్ళచుని, అసోసియేట్ డైరెక్టర్ జహీర్ అక్తర్ షేక్, ఊహ సజ్జ, టీం సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


