మట్టపల్లిలో నిత్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

మట్టపల్లిలో నిత్య కల్యాణం

Jul 30 2026 5:18 AM | Updated on Jul 30 2026 5:18 AM

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుదవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. ఎదుర్కోలు మహోత్సవం అనంతరం నిత్యం కల్యాణం జరిపి శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత నీరాజన మంత్ర పుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌కు

సినారె పురస్కారం

కోదాడరూరల్‌ : కోదాడకు చెందిన ప్రముఖ న్యాయవాది, తెలంగాణ గౌడ సంఘాల నాయకుడు కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌ను జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి జాతీయ పురస్కారం వరించింది. బుధవారం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో నిర్వహించిన సినారె జయంతి సందర్భంగా కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌కు కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. కేఎల్‌ఎన్‌ యువసేన ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ వార్డును అందించారు. కేఎల్‌ఎన్‌ను సన్మానించి అభినందించారు.

మట్టపల్లి హుండీ ఆదాయం రూ.13.17లక్షలు

మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని హుండీలను బుధవారం ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ) కె.భాస్కర్‌ పర్యవేక్షణలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్‌కుమార్‌, ఈఓ చలపతిరావు మాట్లాడుతూ 78 రోజులకు గాను రెగ్యులర్‌ హుండీల ద్వారా రూ.12,40, 040 ఆదాయం రాగా అన్నదాన హుండీ ద్వారా రూ.77,920తో కలిసి మొత్తం రూ.13,17,960 ఆదాయం వచ్చినట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆడిట్‌ అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలి

అనంతగిరి : పెండింగ్‌లో ఉన్న ఆడిట్‌ అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఆడి ట్‌ అధికారి శ్యాంసుందర్‌ ప్రసాద్‌ అన్నారు. బుధవారం ఆయన అనంతగిరి మండల పరి షత్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా 2022–23, 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ఆడిట్‌ అభ్యంతరాలు ఎందుకు పూర్తి కాలేదని గ్రామ కార్యదర్శులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్‌కు గల కారణాలను నివేదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement