విద్యార్థులు కష్టపడి చదవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు కష్టపడి చదవాలి

Aug 2 2026 1:16 AM | Updated on Aug 2 2026 1:16 AM

నడిగూడెం : విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి సులోచనారాణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులు, అధ్యాపకుల రిజిస్టర్‌లను, కళాశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అనుభవం ఉన్న అధ్యాపకులు ఉన్నారని, కార్పోరేట్‌ కళాశాలలకు దీటుగా డిజిటల్‌ తరగతులు కూడా బోధిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కళాశాలకు నిత్యం హాజరు కావాలని సూచించారు. ఆమె వెంట ప్రిన్సిపాల్‌ డి.విజయ్‌ నాయక్‌, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి

సులోచనారాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement