లక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణం

Jul 31 2026 1:21 AM | Updated on Jul 31 2026 1:21 AM

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, పంచామృభిషేకం చేపట్టారు. నిత్య కల్యాణంలో భాగంగా ఎదుర్కోళ్ల సంవాదం, విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ జరిపించి, తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లి రావు, విజయ్‌ కుమార్‌, ఈఓ చలపతి రావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ చార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement