7న ఓబీసీ జాతీయ మహాసభ | - | Sakshi
Sakshi News home page

7న ఓబీసీ జాతీయ మహాసభ

Jul 31 2026 1:21 AM | Updated on Jul 31 2026 1:21 AM

భానుపురి (సూర్యాపేట) : బెంగళూరులో వచ్చేనెల 7న జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఓబీసీ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చలమళ్ల నర్సింహ కోరారు. గురువారం సూర్యాపేటలో పూలే విగ్రహం వద్ద ఓబీసీ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సభ వాల్‌ పోస్టర్లను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలో జనాభా లో 50 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు 50 శాతం కల్పించాలని డిమాండ్‌ చేయనున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు బిల్లు పెట్టాలని, కేంద్రం చట్టసభల్లో మహిళలకు ఇచ్చే 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కూడా 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని చర్చించి తీర్మానం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు బూర మన్సూర్‌గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి నారాయణగౌడ్‌, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్‌ నాయుడు, తండ అంజయ్య గౌడ్‌, కందాల భాస్కర్‌, కోడి లింగయాదవ్‌, యేలే సత్యనారాయణ, యేలుగురి రామ్మూర్తి గౌడ్‌, వెంకన్న, విజయ్‌కృష్ణ, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, రాంబాబు, నాగేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement