వర్క్‌ అడ్జస్ట్‌మెంట్లను రద్దుచేయాలి | - | Sakshi
Sakshi News home page

వర్క్‌ అడ్జస్ట్‌మెంట్లను రద్దుచేయాలి

Jul 31 2026 1:21 AM | Updated on Jul 31 2026 1:21 AM

సూర్యాపేటటౌన్‌ : జిల్లాలో ఉపాధ్యాయుల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్లను జీఓ 25కు భిన్నంగా చేస్తున్నారని, వాటిని వెంటనే రద్దు చేయాలని డీటీఎఫ్‌ నాయకులు కోరారు. ఈమేరకు గురువారం కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌, డీఆర్‌ఓ ప్రేమ్‌ రాజ్‌లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ ఉమర్‌, పాల్వాయి భిక్షం మాట్లాడుతూ.. ఎస్‌జీటీ ఉపాధ్యాయులను ప్రైమరీ పాఠశాలలకే వర్క్‌ అడ్జస్ట్‌ చేయాల్సి ఉండగా ఉన్నత పాఠశాలల్లో తెలియని సబ్జెక్టులను బోధించేందుకు అడ్జస్ట్‌ చేస్తున్నారని, వీటిని రద్దు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement