సూర్యాపేటటౌన్ : విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రూ.8వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువుకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజ బోయిన సుమన్, ప్రధాన కార్యదర్శి పరాల సాయి, గణేష్. శివ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నా
భానుపురి (సూర్యాపేట) : పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వెంటనే బకాయిలను విడుదల చేయకపోతే సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్, జిల్లా అధ్యక్షుడు పోలోజు మహేష్‌చారి జనసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తగుళ్ల జనార్దన్‌యాదవ్, టీఆర్వీఎస్ జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి సాయితేజ, నాయకులు యశ్వంత్, మనోజ్, ఉమేష్, చింటు రమ్య, లక్ష్మీ, ప్రణవి, నరేష్, సతీష్, శశిప్రీతం తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్


