చిలుకూరు: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం చిలుకూరు పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలని తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ చేసి తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ముందుగా ఎస్పీకి పోలీసులు స్వాగతం పలికారు. పోలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ మోహన్, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ రాంబాబు, మేళ్లచెర్వు ఎస్‌ఐ నవీన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


