విచారణ లేకుండా సస్పెండ్‌ చేయడం అన్యాయం | - | Sakshi
Sakshi News home page

విచారణ లేకుండా సస్పెండ్‌ చేయడం అన్యాయం

Jul 31 2026 1:21 AM | Updated on Jul 31 2026 1:21 AM

హుజూర్‌నగర్‌ : బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో ఇటీవల జరిగిన శస్త్ర చికిత్సల అనంతరం కొంత మంది ఇన్‌ఫెక్షన్‌కు గురికావడంతో సరైన విచారణ లేకుండా ఇద్దరు స్టాఫ్‌ నర్సులను సస్పెండ్‌ చేయడం, కాంట్రాక్ట్‌ వైద్యుడిని సర్వీసెస్‌ నుంచి తొలగించడం అన్యాయమని హుజూర్‌నగర్‌ ఏరియా హాస్పిటల్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ విజయరాణి అన్నారు. సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ నర్సింగ్‌ అసోసియేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం స్థానిక ఏరియా హాస్పిటల్‌ వద్ద వైద్యులు, సిబ్బందితో కలిసి భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలతో సిబ్బంది ఆత్మస్థైర్యం కోల్పోయే అవకాశం ఉందన్నారు. వారిని మానవతా దృక్పథంతో విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వారికి టీవీవీపీ జాక్‌ సభ్యులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు రవి కుమార్‌, రాజేష్‌, శ్రీనివాస్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement