నీటిని విడుదల చేయకపోతే నిరాహార దీక్ష | - | Sakshi
Sakshi News home page

నీటిని విడుదల చేయకపోతే నిరాహార దీక్ష

Jul 27 2026 2:06 AM | Updated on Jul 27 2026 2:06 AM

కోదాడరూరల్‌ : ప్రజల తాగునీటి అవసరాల కోసం, చెరువులు నింపేందుకు వారం రోజుల్లో సాగర్‌ నీటిని విడుదల చేయకపోతే నిరాహారదీక్షకు దిగుతానని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని గణపవరం శివారులో ఆరు గ్రామాల రైతులతో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో తాగునీటి అసరాల కోసం నీరివ్వకుండా కాల్వ తూములు మూసేసి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు నీటిని తరలించుకు పోతుంటే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీటిపారుదలశాఖ మంత్రి కావడం జిల్లా ప్రజలకు శాపంగా మారిందన్నారు. ఎల్‌నినోతో వర్షాలు కురువక బావులు, బోర్ల కింద సాగు చేద్దామంటే కరెంటు సరిగా లేక నారుమడులకు కూడా నీరందక రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్‌, చంద్రమౌళి, లక్ష్మీనారాయణ, బ్రహ్మం, వేలాద్రి, అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement