సూర్యాపేటటౌన్ : పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మరింత మెరుగ్గ సేవలు అందించగలుగుతారని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీసు శాఖ, పట్టణంలోని డివైన్ టచ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పోలీసులకు ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పోలీసు సిబ్బందికి లివర్ ఫైబ్రోస్కాన్ పరీక్షలను ఉచితంగా చేశారు. కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిత్యం ప్రజా రక్షణలో బిజీగా ఉండే పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారన్నారు. అందుకే సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే అత్యంత ఖరీదైన లివర్ ఫైబ్రోస్కాన్ పరీక్షలను ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది మంచి ఆహార అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహాచారి, డాక్టర్ విజయమోహన్, సంధ్య మోహన్, సీఐ వెంకటయ్య, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్‌కుమార్, జానయ్య, ఆర్‌ఎస్‌ఐలు సురేష్, సాయిరాం, అశోక్, రాజశేఖర్, అన్వర్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


