మిర్యాలగూడ టౌన్ : ప్రతిఒక్కరూ నేరాలకు దూరంగా ఉండాలని మిర్యాలగూడ ఇన్‌చార్జి డీఎస్పీ రవి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంగళవారం మిర్యాలగూడలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో రౌడీ షీటర్లకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల ప్రశాంతతకు ఎలాంటి భంగం కల్గించొద్దన్నారు. బెదిరించడం, రౌడీయిజం, దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లతో పాటు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. నేరాలకు పాల్పడితే నిర్భంద చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, వన్ టౌన్, టూ టౌన్ సీఐలు నాగభూషణం, సోమ నర్సయ్య, రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య, వేములపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, మాడుగులపల్లి ఎస్‌ఐ సురేష్, అడవిదేవులపల్లి ఎస్‌ఐ శేఖర్, వన్ టౌన్, టూటౌన్ ఎస్‌ఐలు ఆంజనేయులు, రమేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ ఇన్‌చార్జి డీఎస్పీ రవి


