వానైనా.. ఎండైనా.. వాకింగ్‌ తప్పను | - | Sakshi
Sakshi News home page

వానైనా.. ఎండైనా.. వాకింగ్‌ తప్పను

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

చిరుజల్లుల్లో తలకు హెల్మెట్‌తో వాకింగ్‌

అర్వపల్లి : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బందెల వెంకన్న ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వెళ్తుంటారు. వర్షం వచ్చినా, ఎండ కొట్టినా, ఏ ఇతర సమస్యలు ఎదురైనా గ్రామం నుంచి అర్వపల్లికి వాకింగ్‌ చేసుకుంటూ వచ్చి తిరిగి వెళ్తారు. ఆయన గత 25 ఏళ్లుగా ఇలానే వాకింగ్‌ చేస్తున్నారు. మంగళవారం ఉదయం వర్షం వస్తున్నా హెల్మెట్‌ ధరించి వాకింగ్‌ చేశారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఆయన సైకిల్‌పై, మోపెడ్‌పై తిరిగేటప్పుడు కూడా హెల్మెట్‌ ధరించేవారు. ప్రతిరోజు రెండు పూటలా వాకింగ్‌ చేయడం, బయటకు వెళ్తే హెల్మెట్‌ ధరించడం తనకు అలవాటుగా మారిందని వెంకన్న తెలిపారు.

వర్షంలో హెల్మెట్‌ ధరించి వాకింగ్‌ చేస్తున్న వెంకన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement