● వ్యవసాయం పొలం వద్ద
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
మఠంపల్లి : వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన మఠంపల్లి మండలం బక్కమంతలగూడెంలో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బక్కమంతలగూడేనికి చెందిన నిమ్మల నరేష్ (30) మంగళవారం ఉదయం పనుల నిమిత్తం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పొలం వద్ద విద్యుత్ వైరు తెగి పక్కనే ఉన్న ఫెన్సింగ్‌పై పడింది. ఇది గమనించని నరేష్ ఫెన్సింగ్‌పై చేయి పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


